News March 31, 2024
2 లక్షల మంది కంపెనీ సెక్రటరీలు అవసరం: ICSI అధ్యక్షుడు నరసింహన్

కంపెనీ సెక్రటరీస్ కోర్సులు చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై దృష్టిసారించినట్లు ICSI అధ్యక్షుడు నరసింహన్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో 72,000 మంది కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా 2047కు భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లుగా ఎదిగితే దేశానికి 2 లక్షల మంది కంపెనీ సెక్రటరీలు అవసరం ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
భారత్‌తో సమస్యను పరిష్కరించుకుంటాం: బంగ్లా మంత్రి

T20 WC నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న <<19153853>>సమస్యను<<>> చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అమినుల్ హక్ తెలిపారు. ‘నేను ఇండియా డిప్యూటీ కమిషనర్‌తో T20 WC ఇష్యూపై మాట్లాడా. మేం పొరుగు దేశాలతో క్రీడలతో సహా అన్ని రంగాల్లో స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటున్నాం. దౌత్యపరమైన సమస్యలపై ముందే చర్చించి ఉంటే మా జట్టు WCలో ఆడి ఉండేది’ అని హక్ పేర్కొన్నారు.
News February 19, 2026
పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే..

సాధారణంగానే పిల్లలు కుదురుగా ఉండరు. అదేకాకుండా ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలతో పాటు పెద్దల్లో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. పిల్లలు చదివేటపుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వారితో కూర్చొని వార్తలు, పుస్తకాలు చదవాలి. దీంతో పిల్లలకు అది అలవాటవుతుంది. అటెన్షన్ బ్రేక్‌లు ఇవ్వాలి. టైం టేబుల్ తయారుచేసి ఫాలో అవ్వాలి. వారి దృష్టి మరల్చే వస్తువులు దూరంగా ఉంచాలి.
News February 19, 2026
విశాఖలో AI హబ్: సుందర్ పిచాయ్

ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్‌లో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో గూగుల్ AI హబ్‌లను ఏర్పాటు చేస్తోందని కంపెనీ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. మానవాళికి AI చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ AIని చాలా వేగంగా అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీని అందరికీ చేర్చడమే మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.


