News April 25, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25% తగ్గించడంతో ఆ మేర రుణ రేటును కుదించనున్నట్లు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రకటించాయి. దీంతో కెనరా బ్యాంకులో హౌస్ లోన్ కనీస రేటు 7.90%, వాహన రుణ రేటు 8.20% నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ బ్యాంక్ గృహ రుణ రేటు 7.90%, వెహికల్ లోన్ రేటు 8.25% నుంచి మొదలవుతాయి. ఈ నెల 12 నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.
Similar News
News March 14, 2026
రెండోసారి తల్లయిన నటి పూర్ణ

టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లయ్యారు. ఇవాళ ఉదయం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త ఆసిఫ్ ఆలీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితంగా డెలివరీ అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ 2022లో వ్యాపారవేత్త ఆసిఫ్ ఆలీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో బాబుకు జన్మనిచ్చారు. ఈమె తెలుగులో సీమ టపాకాయ్, అవును, సుందరి, అఖండ తదితర చిత్రాల్లో నటించారు.
News March 14, 2026
సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేస్తాం: కేంద్రం

నేషనల్ సెక్యూరిటీ యాక్ట్(NSA) కింద 6 నెలలుగా జైలులో ఉన్న పర్యావరణవేత్త <<17827658>>సోనమ్ వాంగ్‌చుక్<<>>ను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ‘లద్దాక్‌లో శాంతి, స్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నాం. అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలకు సిద్ధం. ఇందులో భాగంగా సోనమ్ శిక్షను రద్దు చేస్తున్నాం’ అని పేర్కొంది. లద్దాక్‌లో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో గతేడాది SEP 26న సోనమ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
News March 14, 2026
IPLలో ఆడనున్న ముజరబాని.. పాక్ బోర్డు లీగల్ యాక్షన్!

PSL కాంట్రాక్ట్‌ను <<19375126>>వదులుకొని<<>> IPLలో KKR తరఫున ఆడటానికి సిద్ధమైన ముజరబాని(ZIM)పై లీగల్ యాక్షన్‌కు పాక్ క్రికెట్ బోర్టు సిద్ధమవుతోంది. చివరి నిమిషంలో ఇస్లామాబాద్ టీమ్ నుంచి తప్పుకోవడాన్ని సవాల్ చేయనున్నట్లు సమాచారం. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బోష్ తొలుత పెషావర్ జల్మీ డైమండ్ జట్టులో చేరి తర్వాత MI టీమ్‌కు షిఫ్ట్ అయ్యారు. కాగా PSL మార్చి 26 నుంచి మే 3 వరకు జరగనుంది.


