News November 19, 2025
2027 ఆగస్టులో బుల్లెట్ రైలు పరుగులు

దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్‌లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని <<18307759>>పర్యటన <<>>తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Similar News
News January 19, 2026
న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. షమీ ఉండాల్సిందేమో!

న్యూజిలాండ్‌తో సిరీస్ కోల్పోయి టీమ్ ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ముఖ్యంగా NZ ప్లేయర్ మిచెల్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. సిరీస్‌లో అతను 352 పరుగులతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు స్టార్ బౌలర్ షమీని గుర్తు చేస్తున్నారు. అతడు ఉండుంటే మిచెల్ ఆటలు సాగేవి కావని, గత రికార్డులే అందుకు నిదర్శనమని అంటున్నారు. ఇరువురి మధ్య పోరులో 16 సగటుతో 4 సార్లు ఔట్ చేసి షమీ ఆధిపత్యం ప్రదర్శించారు.
News January 19, 2026
రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,910 పెరిగి రూ.1,45,690కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.1,750 పెరిగి రూ.1,33,550 పలుకుతోంది. అటు వెండి భగభగలు తగ్గడం లేదు. కేజీ సిల్వర్ రూ.8,000 పెరిగి రూ.3,18,000కు చేరింది.
News January 19, 2026
Photo Gallery: మేడారంలో CM కుటుంబం, మంత్రులు

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఇటీవల నిర్మించిన నూతన గద్దెలను పున:ప్రారంభించారు. అనంతరం మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పించారు. సీఎం సతీమణి, కూతురు, అల్లుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.


