News November 19, 2025

2027 ఆగస్టులో బుల్లెట్ రైలు పరుగులు

image

దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్‌లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని <<18307759>>పర్యటన <<>>తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Similar News

News January 12, 2026

ఆర్సీబీ ఘన విజయం

image

WPL-2026లో యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. ఓపెనర్ హారిస్(85) 10 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా మరో ఓపెనర్ స్మృతి(47*) ఆమెకు సహకారం అందించారు. హారిస్ ఔటైనా రిచా(4*)తో కలిసి స్మృతి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇది ఆర్సీబీకి వరుసగా రెండో విజయం. మరోవైపు యూపీ ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.

News January 12, 2026

Gen Zలో ఎంతో క్రియేటివిటీ: మోదీ

image

Gen Z క్రియేటివిటీతో నిండి ఉందని PM మోదీ అన్నారు. వినూత్న ఆలోచనలు, ఉత్సాహంతో జాతి నిర్మాణంలో యువశక్తి ముందంజలో ఉందని చెప్పారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో ఆయన మాట్లాడారు. యువతను దృష్టిలో పెట్టుకొని వరుసగా పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. దీంతో దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందన్నారు. కల్చర్, కంటెంట్, క్రియేటివిటీతో కూడిన ఆరెంజ్ ఎకానమీలో దేశం అద్భుత వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు.

News January 12, 2026

ALERT: ఈ కోడ్స్‌తో కాల్స్ చేయొద్దు!

image

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్‌కు తెరలేపారు. డెలివరీ ఏజెంట్లమని చెబుతూ USSD కోడ్‌లతో కాల్స్ చేయించి యూజర్ల OTPలు తమకు వచ్చేలా చేస్తున్నారు. తర్వాత ఆయా ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్నారు. 21, 61, 67 వంటి USSD కోడ్‌లతో మొదలయ్యే నంబర్లకు డయల్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిందని భావిస్తే ##002#కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయాలని చెబుతున్నారు.