News March 26, 2024
2,049 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఫేజ్-XII) 2,049 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ఈ నెల 18తోనే అప్లికేషన్ గడువు ముగిసినా 26వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పోస్టులను బట్టి ఎస్సెస్సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మే 6-8 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://ssc.gov.in/
Similar News
News February 12, 2026
US హౌస్‌లో ట్రంప్‌కు షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

US హౌస్ సభ్యులు ట్రంప్‌కు షాకిచ్చారు. <<18949938>>కెనడా<<>>పై విధించిన టారిఫ్స్‌ను తిరస్కరిస్తూ ఓటు వేశారు. డెమొక్రాట్లు తీసుకొచ్చిన తీర్మానం 219-211 తేడాతో నెగ్గింది. ఆరుగురు రిపబ్లికన్లు(ట్రంప్ పార్టీ) కూడా అనుకూలంగా ఓటేయడం గమనార్హం. అయితే దీనికి సెనేట్, ట్రంప్ ఆమోదం తప్పనిసరి. కానీ ట్రంప్ వీటో చేసే అవకాశం ఉంది. సుంకాలను వ్యతిరేకించే రిపబ్లికన్లపై ఎన్నికల సమయంలో చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘గంగాధర’’

భగీరథుడు తన పితృదేవతల మోక్షం కోసం గంగను భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు. గంగ ఆకాశం నుంచి నేరుగా భూమి మీద పడితే ఆ వేగానికి భూలోకం తట్టుకోలేదని శివుడు గ్రహించాడు. గంగమ్మను తన జటాజూటంలో బంధించాడు. తన జుట్టు నుంచి ఓ పాయను బయటకి తీసి, దాని ద్వారా గంగను భూమిపైకి నెమ్మదిగా వదిలాడు. అల్లకల్లోలమైన గంగను శాంతింపజేసి తన తలపై ధరించిన వాడు కాబట్టే ఆయన ‘గంగాధరుడు’ అయ్యాడు. ఇది ఆయన లోకహితైషితకు నిదర్శనం.
News February 12, 2026
జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

ఈ తెగులు వల్ల ఆకులపై లేత ఆకుపచ్చ రంగులో మచ్చలు ఏర్పడి అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోయి చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత, పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ మచ్చ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను పూర్తిగా తొలగించాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.


