News August 18, 2024

21న ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21న ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు.

Similar News

News September 16, 2024

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ ఆదివారం తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సెప్టెంబర్ 23న తిరిగి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తామన్నారు.

News September 15, 2024

అనంతపురం జిల్లాకు 8 మంది DSPల రాక

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎనిమిది మంది DSPలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్‌కు DSPగా వెంకటేశ్వర్లు, అనంతపురం-శ్రీనివాసరావు, గుంతకల్-అముదల శ్రీనివాస్, తాడిపత్రి-రామకృష్ణుడు, అనంతపురం ఉమెన్ పీఎస్-మహబూబ్ బాషా, అనంతపురం-శరత్ రాజ్ కుమార్, అనంతపురం-సునీల్, కదిరికి శివనారాయణ స్వామి బదిలీపై రానున్నారు.

News September 15, 2024

అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమం: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండో తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని’ నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.