News August 19, 2025

22న నస్పూర్‌లో జాబ్ మేళా

image

నస్పూర్ సీసీసీ కార్నర్‌లోని నర్సయ్య భవన్‌లో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సమర్ధనం దివ్యాంగుల సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. డేటా ఎంట్రీ, బీపీఓ, హాస్పిటాలిటీ, రిటైల్, హెల్త్ కేర్, ఆటోమోటివ్ రంగాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18- 30 ఏళ్ల వారు ఎస్ఎస్సీ, డిగ్రీ, డిప్లొమా, ఒకేషనల్ కోర్సు చదివిన వారు మేళాకు హాజరు కావాలని కోరారు.

Similar News

News January 24, 2026

స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

image

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్‌రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.

News January 24, 2026

జిల్లాలో మాతృమరణాల నివారణే లక్ష్యం: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో మాతృమరణాలను నివారించడమే లక్ష్యం పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సంబంధిత శాఖల అధికారులు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మాతృమరణాలకు గల కారణాలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 24, 2026

విశాఖ ఉత్సవ్-2026.. నేడు ఆర్కే బీచ్‌లో గాయని సునీత సందడి

image

భారతదేశపు అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్-2026‌లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆర్కే బీచ్ వేదికగా ప్రముఖ గాయని సునీతతో ‘మ్యూజికల్ నైట్’ జరగనుంది. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘సీ టు స్కై’ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాగర తీరంలో సాగే ఈ సంగీత వేడుకను తిలకించేందుకు నగరవాసులు, పర్యాటకులు తరలిరావాలని నిర్వాహకులు కోరారు.