News August 20, 2025
22న పిఠాపురం రానున్న డిప్యూటీ సీఎం దంపతులు

పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఈ నెల 22న సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ దంపతులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని మహిళలకు 12 వేల చీరలను పంపించిన సంగతి తెలిసిందే. అవి మంగళవారం ఆలయానికి చేరుకున్నాయి.
Similar News
News January 19, 2026
23న SC, ST సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్

ఈనెల 23న SC, ST సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరు హాజరు కావాలని ఆదేశించారు.
News January 19, 2026
సంపు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

ఇంటి ప్రాంగణంలో బోరు, ఇంకుడు గుంతలు ఎక్కడున్నా, నీటిని నిల్వ చేసే ‘సంపు’ మాత్రం కచ్చితంగా ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశల్లోనే ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సంపు కట్టేటప్పుడు అది ఇంటి మూలకు, ప్రహరీ గోడ మూలకు తగలకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. వాస్తుతో పాటు నిర్మాణ భద్రత వంటి శాస్త్రీయ కోణాలను కూడా దృష్టిలో ఉంచుకుని సంపు నిర్మాణం చేపడితే మేలు జరుగుతుందని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 19, 2026
ట్రంప్ విషయంలో సొంత పాలకుల పరువు తీసిన పాక్ జర్నలిస్ట్!

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ PM షరీఫ్, మిలిటరీ చీఫ్ మునీర్ ఆయన్ను 2సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. చివరకు వాళ్లకు వీసా బ్యాన్ బహుమతిగా దక్కింది. పాక్ పాలకుల ఈ వ్యూహాత్మక వైఫల్యాన్ని ఆ దేశంలో ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ బాహాటంగానే ఎండగట్టారు. పైగా ‘భారత్ ఎప్పుడూ ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేయలేదు. అమెరికా విధానాలపై తనదైన దూరం పాటిస్తుంది’ అంటూ చురకలంటించారు.


