News December 13, 2025

22 ఏళ్లకే ఉపసర్పంచ్‌గా ఎన్నిక.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ప్రజాసేవకు!

image

శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామ యువతి బండారి రిషిత (22) అరుదైన ఘనత సాధించారు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించిన ఆమె, గ్రామాభివృద్ధి ధ్యేయంగా కొలువును వదిలారు. ఈమె మంచి మనసును గుర్తించిన గ్రామస్తులు రిషితను తొలి విడత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. యువతకు రిషిత ఆదర్శంగా నిలిచారు.

Similar News

News January 23, 2026

NLG: రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: ఎస్పీ

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నల్గొండ ఆర్టీసీ డిపోలో ఆర్ఎం కె.జాన్ రెడ్డి ఆధ్వర్యంలో రీజియన్ స్థాయిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ.. ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News January 23, 2026

NLG:అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా అధికారులతో గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్.. నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

News January 23, 2026

రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకుందాం: కలెక్టర్

image

జిల్లావ్యాప్తంగా రంజాన్ మాసాన్ని మతసామరస్యంతో, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల వద్ద విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల్లో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.