News November 7, 2025

22 నుంచి నగరంలో పలు చోట్ల భగవద్గీత పోటీలు

image

టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భగవద్గీత పోటీలు జరుగనున్నాయి. 22న కుత్బుల్లాపూర్(వేణుగోపాలస్వామి గుడి), 28న టీటీడీ బాలాజీ భవన్, 29న సరూర్‌నగర్ (విక్టోరియా మెమోరియల్ స్కూల్)లో పోటీలు జరుగుతాయని టీటీడీ అధికారి రమేశ్ కుమార్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 90308 50336 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.

Similar News

News January 23, 2026

రిపబ్లిక్ డే అలర్ట్: సికింద్రాబాద్ గగనతలంపై ‘నో ఫ్లై’ జోన్!

image

JAN 26న పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ భద్రతను పెంచుతున్నారు పోలీసులు. జనవరి 26న ఆకాశంలో డ్రోన్లు ఎగిరేస్తే ఇక కటకటాలే. బేగంపేట, మార్కెట్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డ్రోన్లు, పారా-గ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పూర్తి నిషేధం విధించారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 23, 2026

HYD: IT హబ్‌లో ‘సర్కారు’ కొలువు!

image

IT హబ్‌గా పేరుగాంచిన టీ-హబ్‌లో ఇకపై ఫైళ్ల సందడి కనిపించనుంది. స్టార్టప్‌లకు కేటాయించిన ఈ ఐకానిక్ బిల్డింగ్‌లోకి బేగంపేట డివిజనల్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసు మారుతోంది. ప్రైవేటు భవనాల అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంలో భాగంగా ఈ మార్పు జరుగుతోంది. ఇప్పటివరకు కార్పొరేట్ లుక్కుతో మెరిసిపోయే టీ-హబ్ వాతావరణం ఇకపై రెవెన్యూ అధికారుల రాకపోకలతో కళకళలాడనుంది.

News January 23, 2026

GHMCలో భారీ మార్పులు!

image

GHMC తన IT వ్యవస్థను మారుస్తోంది. హాజరు, పన్నులకే పరిమితం కాకుండా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తోంది. డేటా ఇంటిగ్రిటీని కాపాడేందుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా సిస్టమ్ ఇంటిగ్రేటర్‌ను ఎంపిక చేయనున్నారు. ఫీల్డ్ లెవల్ యాక్టివిటీస్‌ను రియల్ టైమ్‌లో చూసేలా ఈ ప్లాట్‌ఫారమ్ డిజైన్ చేశారు. దీంతో ఫీల్డ్ రిపోర్టుల్లో తప్పుడు సమాచారానికి తావుండదు.