News April 30, 2024

అసెంబ్లీకి 2,387, లోక్‌సభకు 454 మంది పోటీ

image

AP: నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్ర ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను EC అధికారికంగా విడుదల చేసింది. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతి ఎమ్మెల్యే సీటుకు అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీలో ఉన్నారు. విశాఖ ఎంపీ సీటుకు అత్యధికంగా 33 మంది, రాజమండ్రి పార్లమెంట్‌కు అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారు.

Similar News

News December 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 12, 2025

ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

image

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వక‌పోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.

News December 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 12, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.