News November 5, 2025

2,400 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ : UTF

image

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని UTF జిల్లా కార్యదర్శి కౌలన్న, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లప్ప, మండల అధ్యక్షుడు పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కోసిగిలో వారు మాట్లాడుతూ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని కేటగిరీలు కలుపుకొని సుమారుగా 2,400 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News January 19, 2026

ఏలూరు: బాలికను దత్తత తీసుకున్న విదేశీయులు

image

ఏలూరు శిశుగృహలో ఆశ్రయం పొందిన బేబీ ప్రజ్వల అనే 18 నెలల ప్రత్యేక అవసరాలు కలిగిన బాలికను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా విదేశీయులు సోమవారం దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార (CARA) వారి విదేశీ దత్తత నియమ నిబంధనలు ప్రకారం అన్ని విధానాలు అమలుపరచి అమెరికాలో నివసిస్తున్న రాయ్- సామ్యూల్ బెంజమిన్, లోరీయన్ బెంజమిన్ దంపతులు బేబీని దత్తత తీసుకున్నారన్నారు.

News January 19, 2026

2030 కల్లా అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా భారత్: SBI

image

భారత్ ఆర్థికంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని SBI తాజా రిపోర్ట్ వెల్లడించింది. 2028 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపింది. 2030నాటికి ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ దేశాల క్లబ్‌లో చేరనుందని పేర్కొంది. అప్పటికీ మన తలసరి ఆదాయం $4,000 (దాదాపు రూ.3,63,541) మార్కును తాకడం ఖాయమని అంచనావేసింది. 2047నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలవనుందని తెలిపింది.

News January 19, 2026

MNCL: మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు

image

2026- 27 విద్యా సంవత్సరానికి మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో మొత్తం సీట్లు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో యాదయ్య తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 6వ తరగతికి 19-04-2026న ఉ.10 గంటల నుంచి 12 వరకు, 7 నుంచి 10వ తరగతి వారికి మ.2- సాయంత్రం 4గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.