News April 21, 2024
25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి: ఉత్తమ్

TG: ఎంపీ ఎన్నికల తర్వాత BRSలో ఎవరూ మిగలరని హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో BRS, BJP అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవు. ఆ తర్వాత 25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారు. కేంద్రంలో మరోసారి బీజేపీ గెలిస్తే దేశానికే ప్రమాదం. అందుకే జూన్ 9న రాహుల్ ప్రధాని కాబోతున్నారు’ అని ఉత్తమ్ జోస్యం చెప్పారు.
Similar News
News December 13, 2025
రెండు రోజుల్లో బుల్లెట్ నేర్చుకున్న బామ్మ

వయసులో ఉన్న అమ్మాయిలే బుల్లెట్ బండి నడపాలంటే అమ్మో అంటారు. కానీ చెన్నైకి చెందిన 60 ఏళ్ల లతా శ్రీనివాసన్ రెండు రోజుల్లో బుల్లెట్ బండి నడిపి ఔరా అనిపించారు. రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుకున్న లత ఒక అకాడమీలో చేరారు. అక్కడ మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.
News December 13, 2025
నెలలో జరీబు భూముల సమస్యల పరిష్కారం: పెమ్మసాని

AP: అమరావతిలో జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల సమయం కోరామని కేంద్ర మంత్రి P.చంద్రశేఖర్ తెలిపారు. సాయిల్ టెస్ట్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘రాజధాని గ్రామాల్లో శ్మశానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తాం. ల్యాండ్ పూలింగ్‌లో ఇప్పటికీ 2,400 ఎకరాలను కొందరు రైతులు ఇవ్వలేదు. వారితో మరోసారి చర్చిస్తాం. భూసమీకరణ కుదరకపోతే భూసేకరణ చేస్తాం’ అని పేర్కొన్నారు.
News December 13, 2025
పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రెండో శుక్రవారం ₹34.70 కోట్ల కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హిందీ పుష్ప-2(₹27.50Cr) రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(₹24.30Cr), యానిమల్(₹23.53Cr), గదర్-2(₹20.50Cr), హిందీ బాహుబలి-2(₹19.75Cr) ఉన్నాయి. ఓవరాల్‌గా ధురంధర్ మూవీ ₹300+Cr <<18544001>>కలెక్షన్లు<<>> సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది.


