News May 24, 2024

లైంగిక వ్యాధులతో ఏటా 25లక్షల మరణాలు: WHO

image

లైంగికంగా సంక్రమించే వ్యాధులతో(HIV, వైరల్ హెపటైటిస్, STI) ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది మరణిస్తున్నట్లు WHO తెలిపింది. ముఖ్యంగా సిఫిలిస్(STI) వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో 2022లో కొత్త కేసులు పెరిగాయని వెల్లడించింది. నివారణ ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. వీటిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

Similar News

News March 6, 2026

మైనర్లకు SM బ్యాన్.. దేశవ్యాప్తంగా చేయాల్సిందేనా?

image

మైనర్లకు SMను బ్యాన్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. APలో కూడా ఈ తరహా విధానంపై కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించడం అత్యవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. టీనేజర్లు వీటి బారినపడి అశ్లీలత, సమయం వృథా, చెడు అలవాట్లకు గురవుతున్నారని అంటున్నారు.

News March 6, 2026

గిన్నిస్ రికార్డ్.. ఈయనకు 42 పళ్లు

image

సాధారణంగా మనిషికి 32 పళ్లు ఉంటాయని చదువుకున్నాం. కొందరికి 34 కూడా ఉండటం చూస్తుంటాం. కానీ మలేషియాకు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండికి ఏకంగా 42 పళ్లు ఉన్నాయి. ఈయనను అత్యధిక పళ్లున్న వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది. ఆయన ఫొటోను షేర్ చేయగా నోరంతా దంతాలే కనిపించాయి. 2021లో తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆయన డెంటిస్టుల ద్వారా నిర్ధారించుకున్నారు.

News March 6, 2026

కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

image

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.