News October 5, 2025

ECGCలో 25 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) 25 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే (OCT 5) ఆఖరు తేదీ. వయసు 21 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా www.nats.education.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://main.ecgc.in/

Similar News

News January 16, 2026

ఆరోగ్యం కోసం.. రోజూ ఉదయాన్నే ఇలా చేయండి

image

రోజును సరైన పద్ధతిలో ప్రారంభించడం ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు. 10 నిమిషాల పాటు చేసే చిన్న అలవాట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుందని, ఖాళీ కడుపుతో కాఫీ/టీ తాగొద్దని సూచిస్తున్నారు. అదే విధంగా తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్ చేస్తే గుండె, మెదడు పని తీరుతో పాటు పేగుల కదలికలను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.

News January 16, 2026

కనుమ రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

image

కనుమ నాడు పశువుల దైవమైన కాటమరాజుని, సకల దేవతా స్వరూపమైన కామధేనువును భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరి పొలిమేరల్లో మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి, వాటికి దిష్టి తీసి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. పిండివంటల తర్వాత కనుమ నాటి మాంసాహార విందులతో పండుగ సందడి ముగుస్తుంది.

News January 16, 2026

20 శాతం పెరగనున్న డిఫెన్స్ బడ్జెట్!

image

2026-27 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్‌ను 20% పెంచాలని భారత రక్షణ శాఖ కోరుతోంది. గత ఏడాది కేంద్రం రూ.6.81 లక్షల కోట్ల కేటాయించగా.. ఈసారి మరింత ఖర్చు అవసరమని పేర్కొంది. గత బడ్జెట్ తీరులను చూస్తే 20 శాతం పెంపు అంటే అతిగా ఆశ పడటమే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే <<18845622>>ఆపరేషన్ సిందూర్‌<<>>తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్‌లో కేటాయింపులు పెరగాలని పలువురు భావిస్తున్నారు.