News November 12, 2025
26/11 తరహా దాడులకు ప్లాన్?

2008లో ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ టెంపుల్ సహా ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు సమాచారం. పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే రోజు దాడులకు ప్లాన్ చేశారని, కట్టుదిట్టమైన భద్రత, నిఘా వల్ల ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పాయి.
Similar News
News December 8, 2025
విదేశాల్లో వాస్తు పాటిస్తారా?

‘వాస్తు నియమాలు నిర్ధిష్ట ప్రాంతానికి పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడ నివసించినా, వ్యక్తిగత అలవాట్లు వేర్వేరుగా ఉన్నా, పంచభూతాల నియమాలు ఎవరూ విస్మరించలేరు. ప్రపంచంలో వాస్తు సూత్రాలను నిర్లక్ష్యం చేస్తే అది జీవన మనుగడకే ముప్పుగా మారొచ్చు. వాస్తును ప్రాంతాల వారీగా విభజించడం, ఓ ప్రాంతానికే పరిమితం చేయడం అపోహ మాత్రమే. ఈ నియమాలు విశ్వమంతటా పాటించదగినవి’ అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు.
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. రూ.1.88 లక్షల కోట్లకు సంబంధించిన 35 ఒప్పందాలు కుదిరాయి. రంగాల వారీగా ఆ వివరాలు ఇలా..
* డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ&కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- రూ.1,04,000 కోట్లు
* రెన్యూవబుల్ ఎనర్జీ&పవర్ సెక్యూరిటీ- రూ.39,700 కోట్లు
* ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్- రూ.19,350 కోట్లు
* అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ – రూ.13,500 కోట్లు
News December 8, 2025
చంద్రుడిపై చివరి అడుగుకు 53 ఏళ్లు

US ‘అపోలో-11’ మిషన్ ద్వారా 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు మిషన్లలో 12మంది ‘మామ’ను కలిసి వచ్చారు. జాబిలిపై మనిషి చివరిసారిగా కాలుమోపి 53ఏళ్లవుతోంది. 1972 DEC 7-19 మధ్య అపోలో-17 ద్వారా యూజీన్, హారిసన్ మూన్‌పై దిగారు. 75గంటలు గడిపి రోవర్‌పై 35KM ప్రయాణించారు. 110KGల రాళ్లు, మట్టిని తీసుకొచ్చారు. వాటి ద్వారా అక్కడ ఒకప్పుడు అగ్నిపర్వతం ఉండేదని గుర్తించారు.


