News February 19, 2025

27న ఏలూరు జిల్లాలో సెలవు

image

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News April 12, 2026

గురుకులాల్లో ఇంటర్ ఫలితాల జోరు.. గతేడాది కంటే మెరుగ్గా ఉత్తీర్ణత!

image

గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత నమోదైనట్లు ITDA PO బి.రాహుల్ వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 81.76%(గతేడాది 73.83%), ద్వితీయ సంవత్సరంలో 90.44%(గతేడాది 83.86%) ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించడం విశేషం. టాపర్లను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

News April 12, 2026

ATP: రోడ్డు ప్రమాదం.. రుద్రంపల్లి రైతు మృతి

image

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లికి చెందిన రైతు కురుబ మహాలింగ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం రాత్రి తన పొలంలో పండిన చిలగడదుంపలను బొలెరో వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, కర్నూలు సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహాలింగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తూ రైతు విగతజీవిగా మారడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

News April 12, 2026

KKRకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి పతిరణ

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరవని KKRకు శుభవార్త. స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం నుంచి కోలుకున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి NOC కూడా సాధించారు. దీంతో అతి త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. ఆయన రాకతో KKR బౌలింగ్ విభాగం బలపడనుంది. కాగా కోల్‌కతా 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.