News November 30, 2025

2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.

Similar News

News February 10, 2026

బాల్య వివాహ రహిత జిల్లాగా అనంతపురం: కలెక్టర్

image

అనంతపురాన్ని బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ‘బాల్య వివాహ విముక్త భారత్’ ప్రచార రథాన్ని ప్రారంభించి, గోడపత్రికను ఆవిష్కరించారు. వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 3 నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాలల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.