News November 20, 2025
29న పెద్దపల్లిలో సదర్ ఉత్సవాలు

పెద్దపల్లిలో ఈ నెల 29న సదర్ ఉత్సవాలను నిర్వహించనున్నామని ఉత్సవ సమితి పెద్దపల్లి జిల్లా ఛైర్మన్ మేకల విజయ్ కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదవుల సంప్రదాయాలను చాటి చెప్పేలా ఈ సదర్ ఉత్సవాలను చేపడుతామన్నారు. జిల్లాలోని యాదవ సంఘాల నేతలు, కుల బాంధవులు, యువజన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 22, 2026
భారత్‌లో T20 WC ఆడేదే లేదు: బంగ్లాదేశ్

ICC T20WC మ్యాచ్‌లు భారత్‌లో ఆడేదే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. వెన్యూ మార్చితే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. తమకు WC ఆడాలని ఉందని, అయితే ఇండియాలో కాదని తెలిపింది. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ఒప్పుకోని విషయం తెలిసిందే. భారత్‌లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. దీంతో ఇవాళ BCB తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది.
News January 22, 2026
నవజాత గొర్రె పిల్లల మరణాలకు కారణం ఏమిటి?

నవజాత గొర్రె పిల్లల మరణాలు పెంపకందారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పుట్టిననాటి నుంచి 28 రోజుల వయసు కలిగిన గొర్రె పిల్లలను నవజాత పిల్లలుగా పరిగణిస్తారు. నవజాత పిల్లల మరణాల్లో దాదాపు 35 శాతం అవి పుట్టినరోజే సంభవిస్తాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. గొర్రెల పెంపకందారుల నిర్లక్ష్యం, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్న జీవులు సోకడమే ఈ మరణాలకు కారణమని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News January 22, 2026
రికార్డు సృష్టించిన సంగారెడ్డి రైతు

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎల్లో మిర్చి ధర ఆకాశాన్నంటి కొత్త రికార్డు సృష్టించింది. హత్నూర మండలం పన్యాల గ్రామానికి చెందిన రైతు నారగౌడ్ పండించిన మిర్చికి క్వింటాల్ రూ. 42,000 ధర పలికింది. గతంలో ఎప్పుడూ రూ.13 వేల నుంచి 15 వేల లోపే ధర వచ్చేదని, ఈసారి అనూహ్యంగా ఇంత భారీ ధర పలకడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన దిగుబడి ఉంటే మార్కెట్‌లో మంచి లాభాలు వస్తాయని ఈ ధర నిరూపించింది.


