News December 1, 2025
29 అజెండాలతో గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కౌన్సిల్ సమావేశం 29 అజెండా అంశాలతో నేడు రసవత్తరంగా మారింది. గత సమావేశాల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అధికార, విపక్ష కార్పొరేటర్లలో నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి సమావేశం కీలకం కానుంది. కౌన్సిల్ హాల్‌లో ఆసక్తి నెలకొంది.
Similar News
News February 16, 2026
కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు 18,168 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం 5,897 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్పీ ప్రకారం చెల్లించి, రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు.
News February 16, 2026
నిర్మల్‌లో రికార్డ్.. భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్

నిర్మల్ మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్ ఛైర్మన్‌గా ఆమె భర్త అప్పాల గణేష్ చక్రవర్తి సోమవారం ప్రమాణం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మున్సిపల్ కీలక పదవులను దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బలపరిచిన ఈ జంట ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
News February 16, 2026
అల్లూరి: హాల్ టికెట్స్ ఆపితే కఠిన చర్యలు

అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ పరీక్షల జిల్లా అధికారి భీమశంకరరావు సోమవారం తెలిపారు. ఈ జిల్లాల్లో 26 కేంద్రాల్లో 14,166 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. ఫీజులు చెల్లించలేదని హల్ టికెట్స్ నిలిపి వేస్తే కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇబ్బందులుంటే కంట్రోల్ రూం నెంబర్‌కు 9493259259 తెలియజేయాలని సూచించారు.


