News May 1, 2024
2జీ స్కామ్.. కాగ్ అంచనా కంటే ఎక్కువే: దువ్వూరి

2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌పై RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కామ్ విలువ రూ.1.76లక్షల కోట్లని CAG అంచనా వేసినా వాస్తవానికి ఆ మొత్తం ఇంకా ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లో స్పెక్ట్రమ్ ప్రైసింగ్‌లో వచ్చిన లాభాలను కాగ్ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మరోవైపు 2008లో 2జీ లైసెన్స్‌ల కేటాయింపులు కూడా 2001లో నిర్ణయించిన ధరలకే నాటి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
Similar News
News December 11, 2025
ఓవర్‌స్పీడ్‌తోనే 1.24 లక్షల మరణాలు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి

2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 1.24 లక్షల మరణాలకు ఓవర్ స్పీడ్ కారణమన్నారు. 69,088 మంది సీట్‌బెల్ట్, హెల్మెట్ వాడకపోవడం వల్ల మరణించారని రాజ్యసభలో చెప్పారు. స్పీడ్ డ్రైవింగ్ మరణాల్లో తమిళనాడు టాప్‌లో, కర్ణాటక, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. 2023లో తగ్గిన మరణాలు ఈ ఏడాది మళ్లీ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
News December 11, 2025
ESIC ఢిల్లీలో 134 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News December 11, 2025
ఉత్కంఠ.. 4 ఓట్లతో గెలిచింది

TG: హన్మకొండ(D) ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు దారి తీసింది. చివరికి పి.స్రవంతి 4 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి(D) బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో BRS బలపరిచిన భాగ్యమ్మ 5 ఓట్లతో గట్టెక్కారు. వరంగల్(D) వర్ధన్నపేట మండలం అంబేడ్కర్‌నగర్ 1వ వార్డులో రజనీ, రూపకు తలో 31 ఓట్లు రావడంతో డ్రా అయింది. అధికారులు ఫలితం కోసం చిట్టీలు వేయగా రూపను అదృష్టం వరించింది.


