News October 7, 2025

3 గంటల్లో వర్షం.. ప్రకాశం జిల్లాకు ఎల్లో అలర్ట్.!

image

ప్రకాశం జిల్లాకు రానున్న మూడు గంటల్లో తేలికపాటి వర్ష సూచనతోపాటు, పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, ప్రకాశం జిల్లాకు మాత్రం ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. చెట్లకింద ఉండరాదని, తగిన జాగ్రత్తలు వహించాలని ప్రజలకు సూచించారు.

Similar News

News January 17, 2026

మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

News January 17, 2026

నేడు దర్శి రానున్న మంత్రులు

image

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.