News November 20, 2025
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: భట్టి విక్రమార్క

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం, రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ప్రజాభవన్‌లో సీఎస్‌లు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో సూచించారు.
Similar News
News January 23, 2026
DRDOలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 23, 2026
నిన్న విజయసాయి రెడ్డి.. మిథున్ రెడ్డి

AP: మద్యం కుంభకోణం కేసులో ED విచారణకు YCP MP మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ED కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని.. మిథున్ రెడ్డి కోరిక మేరకు ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశానని నిన్న విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.
News January 23, 2026
న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం!

T20 WCకు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ ఆడమ్ మిల్నే టోర్నీకి దూరమయ్యారు. SA20లో ఆడుతుండగా ఎడమ తొడ కండరాలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్థానంలో కైల్ జేమీసన్‌ను NZ రీప్లేస్ చేసింది. ఓరూర్కీ, టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సీర్స్ ఇప్పటికే గాయపడ్డారు. ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ పెటర్నిటీ లీవ్స్ కారణంగా WCలో కొన్ని మ్యాచులకు దూరమయ్యే అవకాశముంది.


