News November 19, 2025

3.11 లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరలు: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన 3,11,922 మంది మహిళలు చీరలకు అర్హులని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించామని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 992 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ నెలలో అదనంగా 3,026 టన్నుల సరఫరా రానుందని పేర్కొన్నారు. ఇప్పటికే 22,175 టన్నుల యూరియా పంపిణీ జరిగిందని, నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

News January 23, 2026

టాస్ గెలిచిన భారత్

image

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో 2 మార్పులు జరిగాయి. అక్షర్, బుమ్రాకి రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో కుల్దీప్, హర్షిత్ రాణాను తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, సాంట్నర్, ఫౌల్క్స్, హెన్రీ, సోథీ, జాకబ్.

News January 23, 2026

తులసిమతి మురుగేషన్‌కు మూడు బంగారు పతకాలు

image

కైరోలో జరిగిన ఈజిప్ట్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు చెందిన ప్లేయర్ తులసిమతి మూడు బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. తమిళనాడుకు చెందిన తులసి ఏప్రిల్ 11, 2002లో జన్మించారు. తులసి ఎడమచేతికి పూర్తి వైకల్యం ఉన్నా దాన్ని అధిగమించి ఏడేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక పతకాలు గెలుచుకున్న ఆమె ఖాతాలో పారిస్ పారాలింపిక్స్ రజత పతకం కూడా ఉంది.