News April 26, 2024
3 GOVT డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా

TG: న్యాక్ గుర్తింపు ఆధారంగా రాష్ట్రంలోని 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు UGC అటానమస్ హోదా ఇచ్చింది. వాటిలో బోధన్, ఖైరతాబాద్, కరీంనగర్(ఉమెన్స్) కాలేజీలున్నాయి. కోదాడ డిగ్రీ కాలేజీకి కూడా అటానమస్ హోదా దక్కాల్సి ఉండగా, చిన్న కారణంతో నిలిపేసినట్లు సమాచారం. కాగా 2022, 2023లో 14 కాలేజీలకు అటానమస్ హోదాను UGC కల్పించింది.
Similar News
News April 19, 2026
ట్రంప్-మునీర్ మైత్రి: అమెరికాకే ప్రమాదం!

ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఎంచుకోవడాన్ని అమెరికా రక్షణ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇరాన్ సైన్యం, నిఘా సంస్థలు, IRGC నేతలతో ఆయనకు ఏళ్ల నుంచి ఉన్న సంబంధాలే ఇందుకు కారణం. గతంలో అఫ్గాన్ విషయంలో మిత్రదేశంగా నటిస్తూనే తాలిబన్లకు సహకరించిన పాక్ ద్వంద్వ నీతిని మరువరాదని, మునీర్‌ను నమ్మడం వల్ల US వ్యూహాత్మక రహస్యాలు ఇరాన్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
News April 19, 2026
కీవ్ సూపర్ మార్కెట్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి!

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌లోని హోలోసివ్స్కీ జిల్లాలో వీధిలో వెళ్తున్న వారిపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం సూపర్ మార్కెట్‌లోకి దూరి కొంతమందిని బందీలను చేసుకున్నాడు. సుమారు 40 నిమిషాల ఉత్కంఠ తర్వాత ప్రత్యేక దళాలు (KORD) జరిపిన ఆపరేషన్‌లో నలుగురు బందీలను విడిపించారు. దుండగుణ్ని కాల్చి చంపారు.
News April 19, 2026
ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ మరణం.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం.
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (ఫొటోలో) జననం.
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.


