News June 19, 2024
గౌతమ్ గంభీర్‌ను BCCI అడిగిన 3 ప్రశ్నలివే?

టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం నిన్న బీసీసీఐ గౌతమ్ గంభీర్‌ను ఇంటర్వ్యూ చేసింది. 40 నిమిషాల ఈ ఇంటర్వ్యూలో 3 కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
1.టీమ్ కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించి మీ ఆలోచనలేంటి?
2.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పుడు.. జట్టులో మార్పులు ఎలా చేస్తారు?
3. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, వర్క్ లోడ్, ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి కారణాలేంటి?
Similar News
News January 16, 2026
20 శాతం పెరగనున్న డిఫెన్స్ బడ్జెట్!

2026-27 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్‌ను 20% పెంచాలని భారత రక్షణ శాఖ కోరుతోంది. గత ఏడాది కేంద్రం రూ.6.81 లక్షల కోట్ల కేటాయించగా.. ఈసారి మరింత ఖర్చు అవసరమని పేర్కొంది. గత బడ్జెట్ తీరులను చూస్తే 20 శాతం పెంపు అంటే అతిగా ఆశ పడటమే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే <<18845622>>ఆపరేషన్ సిందూర్<<>>తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్‌లో కేటాయింపులు పెరగాలని పలువురు భావిస్తున్నారు.
News January 16, 2026
కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేయాలి?

కనుమ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మన దేహం ఓ రథమని, దానిని నడిపించేది ఆ పరమాత్ముడేనని ఈ ముగ్గు మనకు గుర్తు చేస్తుంది. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని దేవుడ్ని ప్రార్థించేందుకు ఇదో సంకేతం. అలాగే ఈ ముగ్గు సంక్రాంతికి భూలోకానికి వచ్చిన బలిచక్రవర్తికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికేందుకు కూడా వేస్తారు. ఒక ఇంటి రథం ముగ్గు తాడును మరో ఇంటి ముగ్గుతో కలపడం సామాజిక ఐక్యతకు, ప్రేమానురాగాలకు నిదర్శనం.
News January 16, 2026
ఇరాన్ గగనతలం ఓపెన్.. ఖతర్ తిరిగొచ్చిన US బలగాలు

ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు కొంత మేర తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితులు సాధారణ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మూసివేసిన ఇరాన్ గగనతలాన్ని తిరిగి రీ-ఓపెన్ చేయగా, ఖతర్‌లోని ఎయిర్‌బేస్‌కు US బలగాలు మళ్లీ చేరుకున్నాయి. దీంతో ఇరు దేశాలూ శాంతించినట్లు స్పష్టం అవుతోంది.


