News April 26, 2024

30న తెనాలిలో చంద్రబాబు పర్యటన: నాదెండ్ల

image

ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

Similar News

News April 12, 2026

GNT: కటకటాల్లోకి సహాయ కమిషనర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

image

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ACB అధికారులు సహాయ కమిషనర్ శాంతిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 7న నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.37 కోట్ల అక్రమాస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 12, 2026

ఇక ఆన్‌లైన్‌లోనూ ‘మీకోసం’ అర్జీలు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.