News December 2, 2025
3,058 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

రైల్వేలో 3,058 NTPC (UG) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, Jr క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన, 18- 30 ఏళ్ల మధ్య గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
Similar News
News February 12, 2026
ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు

AP: గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డులుగా మార్చింది. ఇటీవల మంత్రివర్గం తెలిపిన ఆమోదం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే.
News February 12, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News February 12, 2026
రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

TG: రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రేషన్ కార్డులు లేని అర్హులైన వ్యక్తులు ‘మీ సేవ’ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చవచ్చని తెలిపింది. గత ఏడాది కాలంలో 14.40 లక్షల కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించింది. కాగా 2026 JANకి మొత్తం కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరాయంది.


