News November 14, 2025
35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలు.. వరుసగా 9వ సారి ఎన్నిక!

బిహార్‌లో సీనియర్ నేతలు ప్రేమ్ కుమార్(BJP), బిజేంద్ర ప్రసాద్ యాదవ్(JDU) అరుదైన ఘనత సాధించారు. వరుసగా 9వ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1990 నుంచి వారు MLAలుగా కొనసాగుతుండటం గమనార్హం. తాజా ఎన్నికల్లో గయా టౌన్ నుంచి 26,423 ఓట్ల మెజారిటీతో ప్రేమ్ కుమార్ గెలవగా, సుపౌల్‌లో 16,448 ఓట్ల ఆధిక్యంతో బిజేంద్ర గెలుపొందారు. దాదాపు 35 ఏళ్లుగా ఇద్దరూ అవే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.
Similar News
News November 14, 2025
పరకామణి కేసు.. అతడిది హత్యే!

AP: తిరుమల పరకామణి కేసులో <<18284340>>మృతి<<>> చెందిన మాజీ AVSO సతీశ్‌ది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సిటీ స్కాన్ చేయగా అతడి తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు గుర్తించారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్ CID ముందు రెండోసారి విచారణకు వస్తూ హత్యకు గురయ్యారు. కోమలి రైల్వే పట్టాల సమీపంలో ఆయన శవమై కనిపించారు.
News November 14, 2025
వివాహం గురించి వేదాలేమంటున్నాయి?

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన ఆధారం. ఇది గృహస్థాశ్రమ ధర్మానికి నాంది. మన మేధో వికాసానికి, సామాజిక ఎదుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైనదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ పవిత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంది. వివాహం ద్వారానే సంస్కృతికి, సమాజానికి పునాది పడుతుంది. అందుకే ఈ బంధాన్ని పవిత్రంగా గౌరవించాలి. ఈ బంధం రేపటి తరానికి ఉత్తమమైన వారసత్వాన్ని అందిస్తుంది. <<-se>>#Pendli<<>>
News November 14, 2025
ఆర్చరీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు

ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర(VJA) చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత విభాగంలో రాహుల్(IND)పై 6-2 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల విభాగంలో అంకితా భకత్ 7-3 తేడాతో సౌ.కొరియా ఆర్చర్ నామ్ సు-హ్యోన్‌పై నెగ్గి గోల్డ్ గెలిచారు. ఏషియన్ రికర్వ్ ఆర్చరీలో INDకు ఇవే తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్ కావడం విశేషం. ఈ టోర్నీలో IND 6 గోల్డ్, 3 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ నెగ్గింది.


