News March 26, 2024

ఆరోగ్యమైన గుండె కోసం రోజూ 3600 అడుగులు

image

సాధారణ వేగంతో రోజుకు 3600 అడుగులు వేయడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం 26శాతం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. బఫెలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 63 నుంచి 99 ఏళ్ల మధ్య వయసు గల 6వేల మంది అమెరికన్ మహిళలపై అధ్యయనం చేశారు. ఏడున్నర ఏళ్ల పాటు అధ్యయనంలో భాగంగా నడిచిన 407 మంది హార్ట్ పేషంట్స్‌లో గుండె ఆగిపోయే ప్రమాదం తక్కువగా ఉందని తెలిసింది.

Similar News

News February 7, 2026

స్వల్పంగా పెరిగిన వెండి ధర

image

వరుసగా 2 రోజులు తగ్గిన సిల్వర్ రేటు ఇవాళ కాస్త పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.5వేలు పెరిగి రూ.2,85,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. అటు ఇవాళ బంగారం <<19073344>>ధర<<>> భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

News February 7, 2026

పెళ్లిళ్లలో సంగీతం వాయించేవాడిని: అనిరుధ్

image

ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన చిన్నతనంలో పెళ్లి వేడుకల్లో సంగీతం వాయించేవారు. అప్పుడు తనకు రూ.500 ఇచ్చేవారని, కొన్నిసార్లు తాంబూలం ఇచ్చి పంపేవారని ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘ఆ తక్కువ డబ్బుతో పొందిన సంతోషం ఇప్పుడు రూ.కోట్లు వస్తున్నా కలగడం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. కష్టపడే తత్వం ఉంటే సున్నా నుంచి శిఖరానికి చేరవచ్చని అనిరుధ్ నిరూపించారు.

News February 7, 2026

వంటింటి చిట్కాలు

image

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. * సింక్ గొట్టంలో ఆహార వ్యర్థాలు ఇరుక్కుపోయి దుర్వాసన వస్తుంటే బేకింగ్ సోడాను వేడినీళ్ళలో కలిపి పోస్తే సమస్య పరిష్కారమవుతుంది. * కొబ్బరిపాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపండి. * కొత్తిమీర కాడల్ని కత్తిరించి ఆ ఆకులకు నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.