News November 16, 2025

3Dలోనూ అఖండ-2

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 13, 2026

భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

image

TG: వేసవిలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటి ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి అది 2.50 లక్షల కేసులకు పెరగొచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు అన్ని బ్రూవరీలకు లక్ష్యాలను నిర్దేశించింది. కాగా ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరి కిరణ్ బ్రూవరీలను సందర్శించి బీర్, ఇతర మద్యం ఉత్పత్తిపై సూచనలు ఇచ్చారు.

News January 13, 2026

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>తమిళనాడు <<>>మర్కంటైల్ బ్యాంక్‌ లిమిటెడ్ 20 బ్రాంచ్ హెడ్ (మేనేజర్, సీనియర్ మేనేజర్, AVP) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.ib.tmbonline.bank.in

News January 13, 2026

కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్

image

TG: జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కూతురుగా ఆమె చేస్తున్న విమర్శలపై BRS స్పందించాలన్నారు. మహిళా అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని, అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.