News September 10, 2025

4వేల ఎకరాలు గుర్తించండి: కలెక్టర్

image

రంపచోడవరం PMRC కార్యాలయంలో తహశీల్దార్‌లతో జిల్లా కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు వలన చింతూరు డివిజన్‌లో భూములు కోల్పోతున్న రైతులకు అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో భూములు అందజేయాలన్నారు. కేసుల్లో లేని, వివాదాలు లేని 4,000 ఎకరాలను గుర్తించి నివేదిక 15రోజుల్లో అందజేయాలని తహశీల్దార్‌లను ఆదేశించారు. సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఉన్నారు.

Similar News

News December 14, 2025

మీకోసం కాల్ సెంటర్ వినియోగించుకోవాలి: కలెక్టర్

image

నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.

News December 14, 2025

పల్నాడు జిల్లాలో 22 మంది ఎస్ఐల బదిలీలు

image

పల్నాడు జిల్లాలో ఎస్పీ కృష్ణారావు ఆదివారం ఎస్ఐల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 22 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్ఐలు వెంటనే కొత్త స్టేషన్లలో విధుల్లో చేరాలని ఎస్పీ కృష్ణారావు ఆదేశించారు.

News December 14, 2025

MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

image

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.