News August 12, 2025
4 రోజులే గడువు.. దత్తత ప్రక్రియ పూర్తి చేయండి: కలెక్టర్

ఆగస్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మార్గదర్శకుల ఎంపికను సైతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 10, 2026
మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట రూ.కోటి టోకరా..?

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి నమ్మబలికి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించడానికి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాదిగా నియమకాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 15 నెలలు అవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు వెనకకు ఇవ్వాలని బాధితులు అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది.
News March 10, 2026
ప్రకాశం జిల్లాలో మిస్సింగ్ కేసులపై దృష్టి

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 10, 2026
మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


