News September 13, 2025
4 రోజుల్లో 27,650 టన్నుల యూరియా: తుమ్మల

రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటుందని ఆయన శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే శుక్రవారం 11,930 టన్నులు, ఇప్పటి వరకు మొత్తం 23,000 టన్నుల యూరియా సరఫరా అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
NRPT: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారుల ర్యాండమైజేషన్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ర్యాండమైజేషన్ ద్వారా అధికారులకు విధులను అప్పగించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు.
News December 12, 2025
మక్తల్: పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా మక్తల్ నియోజకవర్గానికి చెందిన మక్తల్, కృష్ణ, నర్వ, ఉట్కూరు, మగనూరు మండలాల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 244 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మిగిలిన వారు ఎంపీడీవో కార్యాలయాల్లో శనివారం సాయంత్రం 5 లోపు ఓటు వినియోగించుకోవాలని చెప్పారు.
News December 12, 2025
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!

అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం కేంద్ర క్యాబినెట్లో చర్చకు రాలేదు. AP నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా సాంకేతిక సమస్యల పరిష్కారంపై AP కసరత్తు చేపట్టింది. 2014-2024 వరకు అమరావతినే రాజధానిగా గుర్తించేలా అది అధ్యయనం చేస్తోంది. ఫ్యూచర్లో రాజధానిని మార్చకుండా ఒకే క్యాపిటల్ ఉండేలా చర్య తీసుకుంటోంది.


