News April 3, 2024
ఒకే ఓవర్లో 4, 6, 6, 4, 4, 4

కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ రెచ్చిపోయారు. వెంకటేశ్ అయ్యర్ వేసిన ఒక ఓవర్‌లో 28 రన్స్ బాదారు. ఆ ఓవర్లో 4, 6, 6, 4, 4, 4 కొట్టారు. దీంతో పంత్ (55) అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆయన ఔటయ్యారు. పంత్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీ విజయానికి 42 బంతుల్లో 144 రన్స్ కావాలి.
Similar News
News February 12, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

కెరీర్‌లో సమస్యలా? ఏ పని దిగ్విజయంగా పూర్తి చేయలేకపోతున్నారా? అయితే మీకు శని త్రయోదశి పూజ సరైంది. శని త్రయోదశి రోజున నిర్వహించే ఈ ప్రత్యేక పూజ మీ శని దోషాలను తగ్గించడమే కాకుండా జీవితంలో సత్ఫలితాలను ఇస్తుంది. తైలాభిషేకంతో కూడిన అర్చనతో శని దేవుడి అనుగ్రహం కూడా పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో నిర్వహించే పూజ పూర్తి వీడియో రికార్డింగ్‌ను 24 గంటల్లో మీకు పంపిస్తాం. వేదమందిర్‌లో ఇప్పుడే <
News February 12, 2026
ఇలాంటి నాయకుడు కావాలి సర్!

ఆప్ ఎంపీ, యువ నేత <<19108486>>రాఘవ్ సింగ్ చద్ధా<<>> పార్లమెంటులో లేవనెత్తుతున్న సమస్యలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆహార కల్తీ, ధరలు, ప్రజా సంక్షేమం, పన్నుల మోత.. ఇలా సామాన్యుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈయన వల్లే 10 నిమిషాల డెలివరీ, గిగ్ వర్కర్ల సమస్యలు దేశానికి తెలిశాయి. కార్పొరేట్ ట్యాక్స్ కంటే వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను ఎక్కువగా ఉందని వేతన జీవుల కష్టాన్ని తెలియజేశారు.
News February 12, 2026
ఒమన్‌పై లంక ఘన విజయం

T20WCలో ఒమన్‌పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత శ్రీలంక 225/5 స్కోర్ చేసింది. కుశాల్ మెండిస్(61), పవన్(60), దసున్ శనక(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. 226 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన ఒమన్ 120/9 స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్-Bలో లంక(4 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన విషయం తెలిసిందే.


