News April 26, 2024

ఒకే ఓవర్‌లో 4,6,4,4,6,రనౌట్

image

KKR ఇచ్చిన భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పంజాబ్ దూకుడుగా ఆడుతోంది. ఆ జట్టు ఓపెనర్ బెయిర్‌స్టో 6వ ఓవర్‌లో ఏకంగా 4,6,4,4,6 బాదారు. చివరి బంతికి సింగిల్ తీసే క్రమంలో ప్రభ్‌సిమ్రన్ రనౌట్ అయ్యారు. దీంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్ 20 బంతుల్లోనే 54 కొట్టారు.

Similar News

News April 18, 2026

KNR: నేడు ఎలగందల్ కోటలో ఉచిత ప్రవేశం

image

కరీంనగర్ జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఎలగందల్ కోటను సందర్శించాలని భావిస్తున్న వారికి అధికారులు శుభవార్త తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నేడు కోటను సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకొని కోటను సందర్శించుకోవాలని పర్యాటకులకు అధికారులు సూచించారు. ఎలగందల్ కోట తన వైభవమైన చరిత్ర, అద్భుత నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందింది.

News April 18, 2026

ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

image

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.

News April 18, 2026

విజయ్ చేతిలో శునకాలు.. ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్

image

హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడి ఊహాశక్తికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం తన సర్వస్వాన్ని అందిస్తానని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలెజాండ్రో మార్టినెజ్(DOP), హేశమ్ అబ్దుల్ వాహెబ్(మ్యూజిక్), ఎరిక్ డర్స్ట్(VFX)ను పరిచయం చేశారు. హీరో శునకాలను, డైరెక్టర్ గుర్రాన్ని పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.