News October 6, 2025

5గంటల ఆలస్యంగా తిరుపతి-హౌరా ఎక్సప్రెస్

image

ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన తిరుపతి-హౌరా ఎక్సప్రెస్(20890) 5 గంటల లేటులో నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలియన కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ చేసుకున్న వారు వేరే మార్గం లేక వేచి ఉండాల్సి వచ్చింది.

Similar News

News January 15, 2026

గాజువాక: లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి

image

గాజువాక వడ్లపూడి జంక్షన్ ఆటోనగర్ వెళ్లే రహదారిలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న రాత్రి జరిగింది. వడ్లపూడిలో నివాసం ఉంటున్న చింత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుండగా కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 13, 2026

కేజీహెచ్‌లో నాలుగు నెలల్లో 100 క్యాన్సర్ ఆపరేషన్లు

image

కేజీహెచ్‌లో వివిధ రకాల క్యాన్సర్లకు అత్యాధునిక ట్రీట్మెంట్ జరుగుతోందని విభాగాధిపతి ఎమ్మెస్ శ్రీనివాస్ తెలిపారు. 4 నెలల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి కేజీహెచ్‌లో సిటీ ఇమ్యులేటర్, ఎక్సలేటర్ క్యాన్సర్ గడ్డలు కనుగొనే పరికరాన్ని ప్రారంభించారు. ఈ పరికరంతో ఏడు జిల్లాల నుంచి వస్తున్న రోగులు, ఒరిస్సా నుంచి వచ్చిన దాదాపు 100 మందికి ఆపరేషన్లు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణీ పేర్కొన్నారు.