News December 1, 2025

5 స్టార్ రేటింగ్ సాధించిన మరిగడ్డ పాఠశాల

image

చందుర్తి మండలం మరిగడ్డ ప్రాథమిక పాఠశాల స్వచ్ఛ హరిత విద్యా రేటింగ్ సాధించింది. జాతీయ స్థాయిలో 2025- 26 సంవత్సరాన్నికి స్వచ్ఛ హరిత విద్యాలయం రేటింగ్లో జిల్లా నుంచి 650 పాఠశాలలు పాల్గొన్నాయి. మరిగడ్డ పాఠశాల 5 స్టార్ రేటింగ్ పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడప రఘుపతిరావు ప్రశంసా పత్రం అందుకున్నారు.

Similar News

News February 18, 2026

ఈ నెల 26న కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి!

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26న కొడంగల్‌కు రానున్నట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ పున:నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఇటీవలే నిధులు మంజూరు చేసింది. ఆలయ నిర్మాణ పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నట్లు తెలిసింది.

News February 18, 2026

వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.

News February 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

టెక్కలి: రోజులు గడిచాయి..వసతుల్లో మార్పు రాదా?
తాలభద్ర రైల్వే వంతెన పనులు ప్రారంభిస్తాం: రామ్మోహన్
జలుమూరు: చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా డీ-వార్మింగ్ డే కార్యక్రమం
ఎల్.ఎన్ పేట: ఎరువుల కోసం రైతుల పాట్లు
జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు
కవిటి: ఈనెల 26న ఎల్లమ్మ జాతర.