News October 7, 2025

5-17 వయసు వారికి ఉచితం: ADB కలెక్టర్

image

17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు అక్టోబర్ 1 నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని
UIDAI తెలిపిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్లు దాటినా వారందరికి రూ.125 వసూలు చేస్తారని తెలిపారు.

Similar News

News January 14, 2026

ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News January 13, 2026

ఆదిలాబాద్: రూ.90 పెరిగిన పత్తి ధర

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,710గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.90 పెరిగినట్లు వెల్లడించారు.

News January 12, 2026

ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.