News March 28, 2024
పదేళ్లలో రూ.5.3 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు

2013-2023 మధ్య ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 4.62 లక్షల మోసాలు జరిగినట్లు RBI వెల్లడించింది. పదేళ్లలో ₹5.3 లక్షల కోట్ల స్కామ్‌లు జరిగాయని RTI దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. ‘రుణాలు, కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతిలోనే ఎక్కువ మోసాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధిక స్కామ్‌లు బయటపడగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, తమిళనాడు, UP, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ ఉన్నాయి’ అని పేర్కొంది.
Similar News
News February 18, 2026
TODAY HEADLINES

* భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి డైరెక్షన్: మోదీ
* బంగ్లాదేశ్ PMగా తారిఖ్ ప్రమాణం
* రేపటి నుంచే రంజాన్
* AP: మార్చి 8న ‘విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి’ ప్రారంభం
* AP: సభకు రాని MLAలను రికాల్ చేయాలి: స్పీకర్
* AP: హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ: సవిత
* రోడ్లు శుభ్రంగా లేకుంటే అధికారుల సస్పెండ్: రేవంత్
* TG: MAR 16 నుంచి ఒంటిపూట బడులు
* ప్రత్యూష కేసు.. నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం
News February 18, 2026
వినియోగదారులకు అండగా NCH.. ఫిర్యాదు చేస్తే చాలు!

మీరు కొన్న వస్తువు నచ్చకపోయినా లేదా డబ్బులు తిరిగి రాకపోయినా ఇక ఆందోళన వద్దు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్-1915 (NCH) గత 9 నెలల్లో 79,521 ఫిర్యాదులను పరిష్కరించి, వినియోగదారులకు ఏకంగా ₹52 కోట్లు రిఫండ్ ఇప్పించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ (ఈ-కామర్స్) మోసాలపై వచ్చిన 47,743 ఫిర్యాదులను పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా డిజిటల్ పద్ధతిలోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
News February 18, 2026
మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

AP: ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతిలో MBU వద్ద విద్యార్థి నాయకుల <<19041650>>కిడ్నాప్ కేసులో<<>> అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.


