News April 22, 2024

మూడేళ్లలో ‘యాపిల్’ నుంచి 5 లక్షల ఉద్యోగాలు

image

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ భారత్‌లో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తోంది. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 4-5 ఏళ్లలో రూ.3.32 లక్షల కోట్లకు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో యాపిల్‌కు 1.5 లక్షల మంది ఉద్యోగులుండగా, మూడేళ్లలో మరో 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలనుకుంటోంది. త్వరలోనే భారీగా నియామకాలు చేపడతామని ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

Similar News

News December 9, 2025

ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: డైరెక్టర్ మారుతి

image

‘బాహుబలి: ది ఎపిక్’ ప్రచారంలో హీరో ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న అక్కడ భారీ <<18509568>>భూకంపం<<>> సంభవించడంతో డార్లింగ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘నేను ప్రభాస్‌తో మాట్లాడాను. ఆయన సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

News December 9, 2025

టీవీని రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తున్నారా?

image

రిమోట్‌తో టీవీని ఆఫ్ చేసినప్పటికీ ప్లగ్‌ని అలాగే ఉంచడం వల్ల నిరంతరంగా విద్యుత్తు వినియోగమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట TV ప్లగ్‌ను తీసేస్తే విద్యుత్ వృథాను తగ్గించవచ్చు. అలాగే ఇది షార్ట్ సర్క్యూట్‌ల ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. టీవీతో పాటు, సెట్-టాప్ బాక్స్‌లు, ఛార్జర్‌ల ప్లగ్‌లను కూడా అవసరం లేనప్పుడు తీసివేస్తే కరెంటు ఆదా అయి, బిల్లు తక్కువగా వస్తుందంటున్నారు. share it

News December 9, 2025

వంటింటి చిట్కాలు

image

* పాయసం చేసేటప్పుడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* అన్నం అడుగంటకుండా ఉండాలంటే దానిలో నెయ్యి, కాస్త నిమ్మరసం కలిపితే సరి. అన్నం తెల్లగా, పొడిపొడిగానూ అవుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* ఉల్లిపాయలను, బంగాళాదుంపలను విడివిడిగా పెట్టకపోతే తేమ కారణంగా రెండూ పాడవుతాయి.