News December 7, 2025
55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేసిన మంత్రి కొండపల్లి

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి కార్పొరేషన్ మండలి (COSIDICI) ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందిన 16 మంది పారిశ్రామికవేత్తలకు జాతీయ గౌరవ పురస్కారాలు లభించాయని మంత్రి తెలిపారు.
Similar News
News January 23, 2026
VZM: ఐటీఐ & డిప్లొమా యువతకు రష్యాలో ఉద్యోగాలు

ఐటీఐ & డిప్లొమా అర్హత కలిగిన యువతకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎంపికైన వారికి నెలకు 60,000 రూబిల్స్ జీతం, 10,000 భత్యం, ఉచిత వసతి, టికెట్లు, బీమా సదుపాయాలు కల్పిస్తారన్నారు. 20 ఏళ్లు పైబడిన వారు naipunyam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 23, 2026
VZM: 27న జాబ్ మేళా.. నెలకు రూ.30,000 వరకు జీతం

విజయనగరంలోని మహారాజా కళాశాల ఆవరణలో ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. నాలుగు సంస్థల ద్వారా 595 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత ఉన్న యువతీ, యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.14,765 నుంచి రూ.30,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు employment.ap.gov.in, ncs.gov.inలో నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు.
News January 23, 2026
ఉపాధి హామీ కింద 100 రోజుల పని తప్పనిసరి: VZM కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద ప్రతి వేతనదారునికి 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులు, కుటుంబ సర్వే, అక్షరాంధ్ర కార్యక్రమాలపై మండల వారీగా సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గృహ సర్వే ఫిబ్రవరి 10లోపు శతశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.


