News December 2, 2025
590 లీటర్ల అక్రమ మద్యం సీజ్: సూర్యాపేట ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎస్పీ నరసింహ ఉక్కుపాదం మోపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 50 కేసుల్లో రూ.4.50 లక్షల విలువైన 590 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేసి, 291 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 17, 2026
సంగారెడ్డి: ఈనెల 21న పాఠశాలల్లో పీటీఎం సమావేశం

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 21న తప్పనిసరిగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని డిఇఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించాలని సూచించారు. చర్చించిన అంశాలను వెంటనే మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.
News February 17, 2026
ఏడుపాయల జాతర.. సేపట్లో రథోత్సవం

ఏడుపాయల వనదుర్గా భవాని మాత జాతర ముగింపు దశకు చేరుకుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో రథం వద్దకు చేర్చారు. ఆనవాయితీ ప్రకారం నాగసాన్‌పల్లి వతందారులు ఈ ప్రక్రియను నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో రథోత్సవం ప్రారంభం కానుంది.
News February 17, 2026
SKLM: జిల్లా స్థాయి చదరంగం పోటీల విజేతలు వీరే

శ్రీకాకుళం ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు100 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. పదమూడేళ్ల లోపు బాలికల విభాగంలో బొల్లా శృతి, వి. రోహిణి, బాలుర విభాగంలో జయంత్ భాను తేజ్ సత్తా చాటారు. 15ఏళ్ల లోపు బాలుర విభాగంలో బొల్ల జస్వంత్ కార్తికేయ, బాలికల విభాగంలో ప్రాణీత లోచన మెరిశారు.


