News November 12, 2025

600 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>RITES<<>>లో 600 సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BSc, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.100. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. NOV 23న రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.rites.com/

Similar News

News November 12, 2025

వంటింటి చిట్కాలు

image

* బెండ, దొండ వంటి కూరగాయలను వేయించేటప్పుడు కొద్దిగా వెనిగర్ కలిపితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.
* కుంకుమ పువ్వును వాడే ముందు కొద్దిగా వేడి చేసి వంటకాల్లో వేస్తే చక్కటి రంగు, రుచి వస్తాయి.
* గ్రేవీలో వేయడానికి క్రీమ్ అందుబాటులో లేకపోతే చెంచా చొప్పున మజ్జిగ, పాలు తీసుకొని కలిపితే సరిపోతుంది.
* బెల్లం, చింతపండు వంటివి త్వరగా నలుపెక్కకూడదంటే ఫ్రిజ్‌లో ఉంచండి.
<<-se>>#VantintiChitkalu<<>>

News November 12, 2025

మీరూ ఈ ప్రశ్న అడుగుతున్నారా?

image

పాతికేళ్లు దాటిన యువతకు సమాజం నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందులో ఒకటి ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్?’ ఇలా పదేపదే అడగడం వల్ల వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిద్రలేమి, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి వాటికి గురవుతారని, తమలో ఏదో లోపం ఉందని భావన కలుగుతుందంటున్నారు. ఫలితంగా జనాలకు దూరంగా ఉంటారని దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్ థాట్స్ వస్తాయంటున్నారు.

News November 12, 2025

NIA, ఐబీ చీఫ్‌లతో అమిత్ షా భేటీ

image

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో మరోసారి కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ, ఐబీ చీఫ్‌లతో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. బ్లాస్ట్‌ దర్యాప్తుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. అటు ఫరీదాబాద్-ఢిల్లీ బ్లాస్ట్ లింక్‌పై NIA ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది.