News May 22, 2024

PACS ఉద్యోగులకూ 62 ఏళ్ల సర్వీసు: హైకోర్టు

image

APలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యే వరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 60 సం. వయసులో రిటైరై ప్రస్తుతం 62 ఏళ్లు పూర్తికాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమ రిటైర్మెంట్ వయసునూ 62 ఏళ్లకు పెంచాలన్న కొందరు PACS ఉద్యోగుల పిటిషన్‌పై ఈ తీర్పు ఇచ్చింది. కాగా 60 సం. పూర్తయ్యే ముందు పిటిషన్లు వేసిన వారికే ఈ తీర్పు వర్తిస్తుంది.

Similar News

News March 10, 2026

రాత్రి మంచి నిద్ర కోసం..

image

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It

News March 10, 2026

యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

image

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.

News March 9, 2026

నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

image

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.