News March 6, 2025
7న బాపట్ల జిల్లా రగ్బీ జట్ల ఎంపిక

బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో ఈ నెల 7వ తేదీన బాపట్ల జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషుల, స్త్రీల విభాగంలో జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయని బాపట్ల జిల్లా సెక్రటరీ పిట్టు సుబ్బారెడ్డి తెలిపారు. రగ్బీలో పాల్గొనే క్రీడాకారులు SSC మార్కుల లిస్టు, పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.
Similar News
News December 13, 2025
ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్

డిసెంబర్ 15 సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News December 13, 2025
పొగ మంచులో ప్రయాణం.. ప్రమాదకరం: ASF ఎస్పీ

పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం అని, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని, పరిమిత వేగంతో వెళ్లాలని ASF ఎస్పీ నితిక పంత్ అన్నారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరి, పొగమంచు దట్టంగా కమ్ముకొని రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా వాహనాలు నడపాలన్నారు.
News December 13, 2025
బీఆర్ఎస్ హయాంలో రాజకీయ కక్ష్యలు లేవు: మాజీ మంత్రి

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు దారుణంగా మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు కలిసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులతో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రాజకీయ ఘర్షణలు లేవని, గ్రామస్థాయిలో పార్టీకి బలమైన పట్టు ఉందన్నారు.


