News April 1, 2024

7న సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష

image

మహబూబ్ నగర్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల, కళాశాల (అశోక్ నగర్-వరంగల్)లో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు తెలిపారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 1 నుంచి 4 వరకు నిర్దేశిత వెబ్సైట్ www.tgtwguruculam.telangana.gov.in లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.

Similar News

News February 13, 2026

మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్‌ ఆలస్యం.. కారణం ఏంటో?

image

మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో చాలా ఆలస్యం అవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికి 1-30 డివిజన్‌ల ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా 31-60 డివిజన్‌ల ఫలితాలు రావాల్సి ఉంది. ఎవరు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News February 13, 2026

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.

News February 13, 2026

MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్

image

మహబూబ్‌నగర్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి కుమార్ జిల్లా మేనేజర్ ఉదయ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులకు లేదా సిబ్బందికి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ సేవలను వినియోగించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.