News August 25, 2024
తిరుమలలో మరో 8 ప్రథమ చికిత్స కేంద్రాలు

AP: అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి <<13894037>>బ్రహ్మోత్సవాల<<>> నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో 12 వైద్య కేంద్రాలుండగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా కొండపై కొత్తగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు TTD వెల్లడించింది. ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, వైద్యపరికరాలను అందుబాటులో ఉంచుతామంది.
Similar News
News January 23, 2026
OFFICIAL: WHO నుంచి వైదొలగిన అమెరికా

WHOతో అమెరికా తన అనుబంధాన్ని తెంచుకుంది. 2026 జనవరి 22న సంస్థ నుంచి అధికారికంగా వైదొలగింది. అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే దీనిపై సంతకం చేశారు. కరోనా సమయంలో WHO సరిగ్గా స్పందించలేదని, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. ఇకపై ఆరోగ్య విషయాల్లో నేరుగా ఇతర దేశాలతోనే ఒప్పందాలు చేసుకుంటామని స్పష్టం చేసింది.
News January 23, 2026
‘నైనీ’ బ్లాకులపై కేంద్ర బృందానికి సింగరేణి CMD నివేదిక

TG: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం హైదరాబాద్‌లో సింగరేణి CMD కృష్ణ భాస్కర్, ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. నైనీ బొగ్గు బ్లాకు టెండర్ ప్రక్రియ వివరాలను CMD ఆ బృందానికి సమర్పించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద వినియోగించిన నిధుల వివరాలనూ అందించాలని బృందం సభ్యులు అధికారులను కోరారు. రెండేళ్లుగా ప్రభుత్వం ‘రాజీవ్ అభయ హస్తం’ పథకానికి ఈ CSR నిధులనే వినియోగిస్తోంది.
News January 23, 2026
సంచలనం.. ట్రంప్ మళ్లీ పోటీ చేస్తారా?

తన మాటలు, చేతలతో వివాదాలు రేపుతున్న ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ‘నేను నాలుగో సారి పోటీ చేయాలా?’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘TRUMP 2028, Yes’ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. US రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా 2సార్లు పని చేయడానికే ఛాన్స్ ఉంది. 3సార్లు పోటీ చేసిన ట్రంప్ 2సార్లు గెలిచారు. మరి నాలుగోసారి పోటీకి తమ రాజ్యాంగాన్ని సవరిస్తారా?


