News November 19, 2025
9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు

AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
Similar News
News January 17, 2026
పొగమంచు తీవ్రత.. ఉ.8 గంటల తర్వాతే బయటికి రావాలి!

AP: రాష్ట్రంలో రేపు ఉ.8 గంటల వరకు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూ.గో, ప.గో జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. పండగకొచ్చి వాహనాల్లో తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పూర్తిగా పొగమంచు తొలగిపోయాకే బయటికి రావాలంది. అటు TGలోనూ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
News January 17, 2026
U-19WC: భారత్ స్కోర్ ఎంతంటే?

U-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టులో కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) మరోసారి ఫెయిల్ అయ్యారు. మరో ఓపెనర్ సూర్యవంశీ 72, అభిజ్ఞాన్ కుందు 80 రన్స్‌తో రాణించారు. మధ్యలో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. మరి భారత్ ఈ టార్గెట్‌ను కాపాడుకుంటుందా? COMMENT
News January 17, 2026
పిల్లల్లో ఆటిజం ఉందా?

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.


