News February 26, 2025
BIG BREAKING: పోసాని కృష్ణమురళి అరెస్ట్

TG: వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు HYD రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
Similar News
News February 27, 2025
అనుకోకుండా గెలవలేదు.. అలవాటు చేసుకున్నారు: సచిన్

CTలో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్ టీమ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారు అనుకోకుండా గెలిచారని ఇకపై ఎవరూ భావించొద్దన్నారు. అఫ్గాన్ కుర్రాళ్లు గెలుపులను అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన జద్రాన్, 5 వికెట్లు తీసిన ఒమర్‌జాయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు.
News February 27, 2025
అఫ్గాన్ చేతిలో ఓటమి.. కెప్టెన్సీపై బట్లర్ కీలక వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీపై జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పుడు ఎలాంటి ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ మిగతా జట్టు సభ్యుల కోసం నేను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలో బట్లర్ వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేయనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
News February 27, 2025
నేడే ‘MLC’ ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సా.4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.